ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ పనితీరు ఎలా మెరుగుపరుచుకోవాలో చర్చించామని తెలిపారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో సీఎం జగన్ అడిగారని.. ప్రజల్లో సంతృప్త స్థాయి ఎలా ఉందో చర్చించామని వెల్లడించారు. కోటి 40 లక్షల కుటుంబాలకు ఎలా సంక్షేమ పథకాలు ఎలా దరి చేర్చామో చర్చించినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.
Pawan Kalyan: 10 గ్రేస్ మార్కులిచ్చి విద్యార్థుల్ని కాపాడండి
ఒక్కో సచివాలయానికి రెండు రోజులు కాకుండా మూడు రోజులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. నో వన్ లెఫ్ట్ బిహైండ్ అనే నినాదంగా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు సాధించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. కొంత మంది విషయంలో సీఎం జగన్ ప్రోటోకాల్ ఫిక్స్ చేశారని పేర్కొన్నారు. మేనిఫెస్టో అమలు చేసిన ప్రభుత్వంగా జనంలోకి వెళ్లాలని సీఎం జగన్ చెప్పారన్నారు. అయితే గడప గడపకు కార్యక్రమంలో ఎక్కడైనా సమయం సరిపోకపోతే టైం తీసుకుని అయినా ప్రతి ఇల్లు టచ్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. కాగా గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.