NTV Telugu Site icon

RK Roja: కేటీఆర్‌ వ్యాఖ్యలపై రోజా రియాక్షన్‌..

Rk Roja

Rk Roja

ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రస్తావించకపోయినా.. అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంలో రోడ్లు, కరెంట్‌ పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.. కేటీఆర్‌ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక, ఇవాళ ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని కలిసిన మంత్రి ఆర్కే రోజా.. ఆ తర్వాత కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు.. ఏపీ గురించి కేటీఆర్‌ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు.

Read Also: Gudivada Amarnath: కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌.. బస్సులు పంపండి..!

ఏపీలో సీఎం వైఎస్‌ జగన్‌ అనేక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు మంత్రి రోజా.. ఏపీ గురించే కేటీఆర్‌ మాట్లాడితే.. ఆ వ్యాఖ్యలను ఖండిస్తానన్న ఆమె.. కేటీఆర్ ఏపీకి వస్తే దగ్గర ఉండి అభివృద్ధి చూపిస్తానన్నారు.. తమిళనాడు వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ సచివాలయాలను తీసుకువచ్చారు.. అవినీతికి తావు లేకుండా పథకాలు అందుతున్నాయని తెలిపారు. కేటీఆర్ కి చెప్పిన ఫ్రెండ్ ఎవరో.. తప్పుగా చెప్పరని భావిస్తున్నానని.. ఏపీకి వస్తే కేటీఆర్.. తెలంగాణలో ఇలాంటి పనులు చేయాలని అనుకుంటారని.. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు పథకాలకు అందిస్తున్నాం అని వెల్లడించారు. ఇక, తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి.. పక్కన ఉండే వారి మాటలు వింటే ఇబ్బందే ఉంటుందని.. పక్క రాష్ట్రం గూర్చి మాట్లాడితే మనోభావాలు దెబ్బ తింటాయన్నారు మంత్రి ఆర్కే రోజా.