NTV Telugu Site icon

Gudivada Amarnath: కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌.. బస్సులు పంపండి..!

కేటీఆర్‌ వ్యాఖ్యలపై వరుసగా స్పందిస్తున్నారు ఏపీ మంత్రలు.. ఢిల్లీలో మీడియాతో మట్లాడిన మంత్రి అమర్‌నాథ్.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రం గురించి కాదను కుంటా అంటూనే కౌంటర్‌ ఇచ్చారు.. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే, కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బస్సులు పంపుతాం అంటే, పంపండి.. మేం కూడా పంపిస్తాం అన్నారు.. ఏపీకి వచ్చి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూడండి, వాలంటైర్ వ్యవస్థ చూడండి, గ్రామ సచివాలయ వ్యవస్థను చూడండి, గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం అమలవుతోందన్నారు.

Read Also: Minister Peddireddy: ఓట్ల కోసం కేటీఆర్‌ అలా మాట్లాడి ఉండొచ్చు..!

ఇక, భాగ్యనగరం వాళ్లు కట్టించిన నగరం కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా అభివృద్ధి జరిగిందన్నారు అమర్‌నాథ్.. గ్రామాల్లో ఉన్న పేదోడు బాగుండాలని.. 32 లక్షల కుటుంబాలకు సొంతింటి కలను నేర వేర్చిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు.. విమర్శించే హక్కు ఎవ్వరికీ లేదు.. వాపును చూసి బలుపు అనుకుంటే ఎలా..? అని నిలదీశారు. మేం దేనికైనా సిద్ధం.. దేశంలో 16 రాష్ట్రాల్లో కట్స్ ఉన్నాయి.. తెలంగాణలో పవర్ కట్స్‌ లేవా? అని నిలదీశారు. మరోవైపు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. టీడీపీపై కామెంట్లు చేసిన మంత్రి.. తెలుగుదేశం అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది.. మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.