NTV Telugu Site icon

Global Investment Summit: వాస్తవ పెట్టుబడుల కోసమే మా ప్రయత్నం.. ప్రచార ఆర్భాటం, ప్రకటనలు కాదు..!

Gudivada Amarnath,

Gudivada Amarnath,

Global Investment Summit: వాస్తవ పెట్టుబడుల కోసమే మా ప్రయత్నాలు.. కానీ, ప్రచార ఆర్భాటం, ప్రకటనల కోసం ప్రయత్నాలు చేయడం లేదన్నారు ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ లో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్న “గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్” కు కేంద్ర మంత్రులను ఆహ్వానించడానికి హస్తినకు వచ్చినట్టు వెల్లడించారు.. ఈ సమ్మిట్‌ ద్వారా 13 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయించామని తెలిపారు.. సంబంధిత కేంద్ర మంత్రులను “సమ్మిట్” ఆహ్వానిస్తున్నాం.. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను కూడా అందరినీ ఈ సమ్మిట్‌కు ఆహ్వానించామని తెలిపారు.. ఇక, 3 పారిశ్రామిక వాడలు ఏపీలో ఉండడం అదృష్టంగా చెప్పుకొచ్చారు మంత్రి.. విశాఖలో జరగనున్న సమ్మిట్‌కు.. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజనాథ్‌ సింగ్, మాండవీయ, కిషన్ రెడ్డిలను కూడా ఆహ్వానించామని తెలిపారు.

Read Also: Revanth Reddy : అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‎ను అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‎గా మారుస్తాం

అయితేచ, ముందుగా ఒక లక్ష 87 వేల కోట్ల రూపాయలు మేరకు పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు మంత్రి అమర్నాథ్‌.. వాస్తవ పెట్టుబడుల కోసమే మా ప్రయత్నాలు కానీ, ప్రచార ఆర్భాటం, ప్రకటనల కోసం ప్రయత్నాలు చేయడం లేదన్న ఆయన.. విశాఖ అనువైన ప్రదేశం కాబట్టే, పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామే కానీ, రాష్ట్ర రాజధాని వాదాన్ని బలపరుచుకోవాలనే లక్ష్యంతో పని చేయడం లేదన్నారు.. కాగా, విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల లాంటి ప్రముఖులు ఉన్నారు.. ఏపీ ప్రభుత్వం మార్చి 3, 4 తేదీలలో రెండు రోజుల పాటు ఈ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్ర మంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నారు.

Show comments