NTV Telugu Site icon

RIP Goutham Reddy: ఢిల్లీలో గౌతమ్ రెడ్డి సంతాపసభ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు పొందిన అజాతశత్రువు దివంగత ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఢిల్లీలో జరిగింది. గౌతమ్ రెడ్జి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఏపీ భవన్ అధికారులు.

తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. గౌతమి రెడ్డి మరణం వార్త అబధ్దం కావాలని కోరుకున్నాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనిషి ఇక లేరు. గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులుకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. మా మంత్రివర్గంలో నెంబర్ వన్ వ్యక్తి గౌతమ్ రెడ్డి అన్నారు మంత్రి బొత్స.

మంత్రితో పాటు నివాళులు అర్పించారు ఎంపీలు సత్యవతి, రెడ్డప్ప, రంగయ్య,మాధవ్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, ఏపీ భవన్ సిబ్బంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేకపాటి కుటుంబం, గౌతమ్ రెడ్డి చేసిన కృషి అనన్య సామాన్యం అన్నారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ అత్యంత క్రమశిక్షణ , ఎనర్జీ కలిగిన నాయకుడు గౌతమ్ రెడ్డి, పాలిటెక్నిక్, ఐటిఐ లను ఇంటిగ్రేట్ చేయాలన్న ఆలోచన చేశారన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ప్రవీణ్ ప్రకాష్. గౌతమ్ రెడ్డి మృతి అత్యంత దురదృష్టకరం, చిన్న పరిశ్రమల బాగుకోసం పరితపించిన వ్యక్తి అన్నారు ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.

విధిరాతకు ఎవరైనా తలవంచకు తప్పదు. ఇటీవలే 5 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. గొప్ప సమర్ధుడైన నాయకుడు. భగవంతుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు ఎంపీ రెడ్డప్ప. గౌతమి రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. 11 ఏళ్లు గా పరిచయం. నన్ను ఓ తమ్ముడిలా పలు అంశాల్లో మార్గదర్శకం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్జి పట్ల అత్యంత అభిమానాలతో, గొప్ప సహచరుడుగా వ్యవహరించారు. తిరుపతిలో పలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలో గౌతమి రెడ్డి నాకు తోడుగా నిలిచారని ఆవేదనకు లోనయ్యారు డా.ఎంపీ గురుమూర్తి.

ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ ఈ వార్త నిజంకాకుండా ఉంటే బాగుంటుందని భావించాను. నిగర్వి, సౌమ్యుడు, సమర్ధుడు అయున గౌతమి రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నా అని నివాళులర్పించారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న సోదరుడుని కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృధు స్వభావి, సమర్ధులైన గౌతమి రెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటు. కుటుంబ సభ్యులకు సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా అన్నారు ఎంపీ సత్యవతి.