NTV Telugu Site icon

GBS: జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి.. స్పందించిన మంత్రి డోలా

Minister Dola

Minister Dola

గులియన్ బారే సిండ్రోమ్.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ వ్యాధితో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లాలోని అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీఎస్ వ్యాధితో ప్రకాశం జిల్లా మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పందించారు. జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

Also Read:Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవర్ స్టార్‌ సీన్ లీక్.. గూస్ బంప్స్ పక్కా!

జీబీఎస్ అంటు వ్యాధి కాదని మంత్రి డోలా తెలిపారు. ఈ వ్యాధికి అన్ని ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్లు వెంటనే తగిన వైద్యం అందించాలని కోరారు. జీబీఎస్ పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారని తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని మంత్రి డోలా సూచించారు.