NTV Telugu Site icon

Minister Dharmana: సీఎం జగన్‌పై ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Dharmana Prasada R

Minister Dharmana Prasada R

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పాలితులుగా ఉన్న వర్గాలను పాలకులుగా నియమించారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల నేతలు గతంలో రాజ్యాధికారం రావాలని ఉద్యమించారు.. సీఎం జగన్ విశాలభావం కారణంగా ఇప్పుడు మార్పు వచ్చిందన్నారు. ఒకలక్షా ఇరవై వేల కోట్లు పథకాలకు కేటాయించారని గుర్తుచేసిన ఆయన.. కమ్మర, కుమ్మరి, పొందర లాంటి కులాలు పథకాలు పొందేందుకు తలవంచలేదు కదా? అని ప్రశ్నించారు.

Read Also: Atmakur By Election: ఆత్మకూరు బైపోల్‌.. జిల్లా వ్యాప్తంగా అమల్లోకి మోడల్‌ కోడ్..

గతంలో ఇంటిమీద జెండా… ఒంటి మీద పసుపు చొక్కా ఉంటే పథకాలు ఇచ్చేవారు అని ఆరోపించారు మంత్రి ధర్మాన.. ఇక, పథకం పొందటానికి లంచం ఇచ్చామని చెబితే వారికి అవార్డు ఇస్తామని ప్రకటించారు.. అన్ని వర్గాలవారు పాలితులుగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు.. చాకలి, ‌మంగలి, కమ్మరి, నేతన్న అందరూ గౌరవంగా బ్రతకాలని పేర్కొన్నారు. సామాజిక న్యాయం పదవులే కాదు.. విద్య, సామాజిక, ఆర్థికంగా మార్పు తెస్తున్నాం.. మనం చైతన్యంగా లేకపోతే , ఇతర వర్గాల సీఎం వైఎస్‌ జగన్‌ణు దూషిస్తారు.. మనం జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.