రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విపక్షాలపై మండిపడ్డారు. మహిళల చేతికే జగన్ ప్రభుత్వం పూర్తిగా అధికారం ఇచ్చిందన్నారు. మీకొడుకు , భర్త , మామ సైకిల్ కి ఓటు వేయాలని కోరుతుంటారు. అలా చేయకుండా మహిళలు ఆలోచించి ఓటువేయాలన్నారు.ఓటు వేసేది సీక్రెట్ కనుక మగాళ్ల మాట ఈవిశయంలో వినవద్దు. మహిళలు జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఎవరి చేతులు వారు నరుక్కున్నట్లే. ఓటు అనే తాళం మీచేతిలో ఉంటుంది. మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఆర్దికం ఇబ్బంది ఉన్నా మాట ఇచ్చాం కనుక పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు. కొంతమంది సిఎం జగన్ పై తీవ్రమయిన పదాలతో విమర్శలు చేస్తున్నారు , అలా ఆరోపణలు చేసిన వారిని నమ్మవద్దన్నారు.
స్కాంల నాయకుడు చంద్రబాబే
మంత్రి గుమ్మనూరు జయరాం రాష్ట్రంలో స్కాం లు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు. 2014 నుండి రాజధాని పేరుతో, మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ లో 371 కోట్ల స్కాం చేశారు.రెండు స్కాం లో 800 కోట్ల రూపాయలు దోచుకున్నారు.రెండు ఎకరాల భూస్వామి ఎన్ని ఎకరాలు దోచుకొనున్నారో అర్థం అవుతుంది. ఆర్థిక అసమానతలను కాపాడిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దే..ప్రజలకు మేలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పై బురద చల్లి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
లోకేష్ పాదయాత్రలోప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం లేదు.అన్ని రంగాలలో సీఎం జగన్ అభివృద్ధి చేసి, మూడు పూటలా ప్రజలకు భోజనం అందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారు. ఏపి ప్రజలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికే పరిమితం చేస్తారు. బడ్జెట్ సమావేశాల్లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానంపై చేయడం సంతోషంగా వుందన్నారు.
Read Also: Boinapally Vinod Kumar: పుట్టగతులు ఉండవనే.. బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నాయి