NTV Telugu Site icon

Minister Dharmana: బాబును ప్రజలు నమ్మరు.. ఆయన హయాం బ్రోకర్ల మయం..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

చంద్రబాబు హయాం అంతా బ్రోకర్ల మయం.. ఇప్పుడు ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు… శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నయాపైసా లంచం లేకుండా లబ్ధిదారులకు నేడు సంక్షేమం అందిస్తుందన్నారు. బ్రోకర్ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని గుర్తుచేశారు.. అయితే, చంద్రబాబు హయాంలో అంతా బ్రోకర్ల మయం చేశారని.. అవినితిపరుల మయం అయ్యిందన్నారు. నాడు తాయాలాలు చెల్లించడంతో పాటు, ఇంటి మీద పసుపు జెండా ఉండాలి.. అప్పుడే పథకాలు వర్తింపజేసేశారు.. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా జన్మభూమి కమిటీల వద్దకు వెళ్లాలని సూచించేవారంటూ సంచలన ఆరోపణలు చేశారు. నేడు మళ్లీ చంద్రబాబు.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, మళ్లీ ఉద్దరిస్తానంటున్నారని మండిపడ్డారు.. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలేదని స్పష్టం చేశారు.

Read Also: VijayaSai Reddy: భయపడేవాళ్లకే పొత్తుల గురించి ఆలోచన…!