NTV Telugu Site icon

Minister Dharmana Prasada Rao: గెలిస్తే ఎంత.. ఓడిపోతే ఎంత.. ధర్మాన ఓడిపోతే కొంప ఏమీ మునిగిపోదు..!

Dharmana Prasada Rao

Dharmana Prasada Rao

Minister Dharmana Prasada Rao: ఎన్నికల్లో గెలుపు, ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం పట్టనానికి చెందిన యువనేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాద్ ఓడిపోతే కొంప ఏమీ మునిగిపోదు… గెలిస్తే ఎంత..? ఓడిపోతే ఎంత..? అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. సమాజంలో.. ప్రభుత్వం వలన వస్తున్న మార్పులను యువకులు గుర్తించాలని సూచించిన ఆయన.. సమాజాన్ని నడిపించేందుకు శక్తి, బలం ఉన్న యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొందరికి వైసీపీ అంటే అవగాహానలేదు.. చాలా మంది వైశ్యులు బ్యాక్ వర్డ్ క్లాస్ లో కలపమని అడిగారు… నేను కేబినెట్‌ మినిష్టర్ గా కమిషన్‌ రికమెండేషన్ లో పెట్టించాను.. తర్వాత ప్రభుత్వం బీసీలలో కలిపిందని గుర్తుచేశారు.. కానీ, ప్రయెజనం చేసిన వారికి నష్టంచేసే పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: Somu Veerraju: జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తాం.. అధికారమిస్తే ఐదేళ్లలో రాజధాని కట్టి చూపిస్తాం..

విద్యా విధానం రాష్ర్టంలో అధ్బుతంగా అమలు అవుతోందని తెలిపారు మంత్రి ధర్మాన.. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత అక్షరం ముక్కరాని వ్యక్తులు ఉన్నారు.. అయితే, ఇప్పుడు విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం, పౌష్టికాహారం వంటివి ఇవ్వడం ఓట్లకోసం మాత్రం కాదని స్పష్టం చేశారు.. ఆర్థిక అసమానతలు తగ్గించే పని ప్రభుత్వాలు చేయాలి.. ఆపనినే నేడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ చేస్తుందన్నారు. రాష్ర్టంలో ఏ ఒక్క వ్యాపార సంస్థ మీద దాడిచేసేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంలేదన్నారు.. కానీ, బిజినెస్ కమ్యూనిటీ వ్యతిరేకంగా ఉంది ఎందుచేత..? వ్యాపారులు గుండెల మీద చెయ్యి వేసుకోని చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంలో లంచాలు లేవు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలలో ప్రజల్లోకి తీసుకువెల్లడమే రాజకీయానేతల పని అని.. సమాజంలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులను గుర్తించాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.