NTV Telugu Site icon

కొత్త జిల్లాలపై వచ్చే నెల 26 వరకు అభ్యంతరాల స్వీకరణ: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో నోటీఫికేషన్‌ విడుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు.

Read Also: ఆంధ్ర రాష్ట్రాన్ని వివాదాలు, అప్పులు, అవినీతిమయం కానివ్వం: సోము వీర్రాజు

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వచ్చే నెల 26వ తేదీ స్వీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రజాప్రతి నిధులు అందరూ కోరుకున్నట్లుగానే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. అతి ముఖ్యమైన రూరల్ యూనివర్సిటీ, పారిశ్రామిక వాడ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటాయని మంత్రి ధర్మనా కృష్ణదాస్‌ తెలిపారు.