NTV Telugu Site icon

Botsa Satyanarayana: ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం.. మంత్రి బొత్స

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Minister Botsa Satyanarayana On AP Govt Employees Issue: ఉద్యోగుల సమస్యలన్నింటినీ అవకాశం ఉన్నంతవరకు పరిష్కరిస్తామని ఏపీ మంత్రి బొత్స తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం అయ్యిందని స్పష్టతనిచ్చారు. సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఫైనాన్స్, జీఏడీ తదితర శాఖల అధికారులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాస రావు, వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు.

CM Jagan: వట్టిచెరుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఈ సమావేశం అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై జనవరిలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గురుకులాల్లో, యూనివర్శిటీల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో పాజిటివ్ నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స మాటిచ్చారు. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కెబినెట్లో చర్చిస్తామని.. స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. పీఈర్సీ, డీఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పినా.. ఉద్యోగులు అంగీకరించలేదన్నారు. ఈ బకాయిలను 16 విడతల్లో నాలుగేళ్లల్లో చెల్లింపులు జరపాలని డిసైడ్ అయ్యామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు.

Nadendla Manohar: జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తారు

అలాగే.. ఈ సమావేశం తర్వాత ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడారు. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తంగా రూ. 7 వేల కోట్లు ఉంటాయని.. ఈ బకాయిలను నాలుగేళ్లల్లో విడతల వారీగా చెల్లించేలా అంగీకరించారని తెలిపారు. విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7-8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడానికి ఒప్పుకున్నారన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని తాము స్పష్టంగా చెప్పామన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సానుకూలంగానే స్పందించారన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను చాలావరకు నెరవేర్చిందన్నారు. తమ ఉద్యమం కొనసాగింపుపై గుంటూరులో ఈ నెల 8వ తేదీన జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని వెల్లడించారు.