NTV Telugu Site icon

Botsa Satyanarayana: చంద్రబాబు సహనం కోల్పోయారు

Botsa On Chandrababu

Botsa On Chandrababu

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేటలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. సహనం కోల్పోయి చంద్రబాబు మాటాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాటాడుతున్నారు.బాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయి. అతనే నిజాయితీ , సచ్చీలుడుగా మాటాడుతున్నారు. చంద్రబాబు సభ్యసమాజం హర్షించని విదంగా మాటాడుతున్నారు. సానుభూతి కోసం మాటాడుతున్నారు‌. తాను యోగి , మహాపురుసుడు , ఇతరులు దుర్మార్గులు అన్నట్టు మాటాడుతున్నారు.

Read ALso: Rajinikanth: రజినీకాంత్ జపం చేస్తున్న సోషల్ మీడియా

వైసిపి వెనుక జనం ఉన్నారని అసహనానికి లోనవుతున్నారు. ఇంత వయస్సు వచ్చి ఎందుకు సహనం కోల్పోతున్నారన్నారు. మాకు మాటలు వచ్చు , రాజ్యాంగాన్ని గౌరవించబట్టే మాటాడటం లేదు. ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు లా అబద్దాలు, ఫ్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటి చేస్తూ మాటాడాల్సిన‌ పనిలేదు. వచ్చే ఎన్నికలలో మనం చేసినపనులు చెప్పుకుంటే చాలు. భూ రికార్డుల సమష్య పాదయాత్రలో రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారం లోకి వచ్చాక భూ హక్కు కార్యక్రమం తీసుకువచ్చాం.

దేశం మెత్తం భూ హక్కు కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. గ్రామకంఠాలు , ఎండోమెంట్ , ఉమ్మడి కుటుంబాల భూ సమష్య లేకుండా చుసేందుకు ప్రయత్నిస్తున్నాం. నరసన్నపేట లో 23 వ తేధీన రెండొవిడిత శాస్విత భూ హక్కు , భూరక్ష కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రభుత్వం తో పాటు కార్యకర్తలు అంతా ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి. సామాన్యుడికి న్యాయం జరగాలంటే జగన్ మోహన్ రెడ్డి సిఎంగా ఉండాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read Also: Donald Trump : ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’.. ట్విటర్ పై ట్రంప్ అసహనం