ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారని వస్తున్న ఆరోపణలను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర అసహనంతో ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే సీఎం జగన్ ఒప్పుకోరని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
Read Also: చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి
మహిళలపై తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను సభలో ఎవరూ ప్రస్తావించలేదన్నారు. భువనేశ్వరి తమకు సోదరి వంటిదని, ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒప్పుకోబోమన్నారు. అలాంటిది తామే ఎందుకు దూషిస్తామని బాలినేని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేశారని, దానికి కౌంటర్‌గానే వైసీపీ నేతలు వంగవీటి రంగా, మాధవరెడ్డి హత్యల గురించి చర్చించాలని మాత్రమే అన్నారని బాలినేని వివరణ ఇచ్చారు.
