చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు.

Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్

ఇప్పటికైనా చంద్రబాబు లాంటి మోసగాడిని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టాలని లక్ష్మీపార్వతి హితవు పలికారు. ఆనాడు తనకు కావాల్సినంత డబ్బు ఇస్తానని, విదేశాలకు వెళ్లిపోవాలని చంద్రబాబు తనను కోరాడని.. బాలయ్య బాబుకు ఈ విషయం తెలియదని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నాడని.. ఆయన మాటలను నమ్మవద్దని కోరారు. చంద్రబాబుపై పోరాటం చేసేందుకే తాను వైసీపీలో చేరారని.. తన సిద్ధాంతం, జగన్ సిద్ధాంతం ఒక్కటేనన్నారు. విజయమ్మ, షర్మిలపై టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన విషయం మీకు తెలియదా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెప్పించుకుని నందమూరి ఫ్యామిలీ అసలు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పురంధేశ్వరికి చంద్రబాబు నిజస్వరూపం తెలియదా అని నిలదీశారు.

Related Articles

Latest Articles