Site icon NTV Telugu

ఏపీ విద్యుత్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..త్వరలో డీఏ,పీఆర్సీ చెల్లింపు

ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య పీఆర్సీపై ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమనకు సమ్మతంగా లేదని ఉద్యోగ సంఘాలు నిరసనలకు పిలుపునివ్వడంతో పాటు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. అయితే ఈనేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను చెల్లిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

Read Also: రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన నిర్మలాసీతారామన్

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన విధంగానే విద్యుత్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్నా 4 డీఏల చెల్లింపుపై ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ మార్చి 31తో ముగుస్తుందన… కొత్త పీఆర్సీ కమిటీపై ఒకటి రెండు రోజుల్లో జీవో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీపై వివాదం కొనసాగుతున్న సమయంలో విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై వారు ఎలా స్పందిస్తారో.. కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుందో వేచి చూడాలి మరీ.

Exit mobile version