విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని, భీమిలీలో పదివేల మందికి పైగా ఇళ్లపట్టాలిచ్చామని పేర్కొన్నారు.
ఓటీఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని ఆయన తెలిపారు. ఓటీఎస్ కట్టని వారికి సంక్షేమ పథకాలు నిలిపి వేస్తారని ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను మింగుడుపడని కొందరు కావాలని ద్రుష్పచారం చేస్తున్నారని, ఓటీఎస్ పై రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.