Site icon NTV Telugu

ఏ చిన్న లక్షణం కనిపించినా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోండి: మంత్రి అప్పలరాజు

కోవిడ్ పరిస్థితి పై జిల్లా అధికారులతో మంత్రి సీదిరి అప్పలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ను ఏవిధంగా ఎదుర్కొవాలో అధికారులకు పలు సూచనలు చేశారు. కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలో మన నుంచి ఇతర రాష్ట్రాల వారు తెలసుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత ఎక్కువగా వచ్చింది.

Read Also: ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 6,996 కేసులు

10వేల లీటర్ల కెపాసిటీ ఆక్సిజన్ ప్లాంట్స్ నేడు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. 3,300 బెడ్స్ సిద్ధం చేశామన్నారు. 520 ICU బెడ్స్‌ను కూడా సిద్ధం చేశామన్నారు. ఎలాంటి చిన్న లక్షణాలు ఉన్నా పరీక్షలు వెంటనే చేయించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మూడు RTPC ల్యాబ్స్ సైతం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆస్పత్రిలో జాయినన్‌ అయ్యే వారిలో 90శాతం వ్యాక్సిన్‌ వేయించుకోని వారే ఉన్నారని మంత్రి వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌ వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.

Exit mobile version