Site icon NTV Telugu

జగన్ కన్నెర్ర చేస్తే.. రోడ్డు మీద తిరగగలుగుతారా?

Anil Kumar Yadav

Anil Kumar Yadav

ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిజంగా కన్నెర్ర చేస్తే మీరు రోడ్డు మీద తిరగగలుగుతారా ? అచ్చెన్నాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ప్రజల్లోకి వెళదాం… మీ సీట్లు మీకు మిగులుతాయో లేదో చూసుకుందామని పేర్కొన్నారు. ఓటమి తప్పదని ముందే టీడీపీ పారిపోయిందని… ఎన్నికలు బహిష్కరిస్తామని డ్రామాలు చేసిందని విమర్శించారు.
రెండేళ్ల జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి చూసి ఒక నమ్మకంతో మద్దతు ఇస్తున్నారని… నామినేషన్ వేసుకునే దిక్కులేని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. ప్రజలు 80 శాతం వైసీపీకి మద్దతు ఇచ్చారని… ముఖ్యమంత్రి పై నోటికి వచ్చినట్లు అయ్యన్నపాత్రుడి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మేము కూడా తిట్టగలం, మాకు భాష వచ్చని… పాత్రకు సొట్టలేసినట్లు అయ్యన్నపాత్రుడికి వేయగలమన్నారు.

Exit mobile version