NTV Telugu Site icon

Ambati Rambabu vs Pawan Kalyan: మా నాన్న నాస్తికుడన్న పవన్‌.. కౌంటర్‌ ఇచ్చిన అంబటి

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu vs Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏ కామెంట్‌ చేసినా.. వెంటనే అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల నుంచి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.. తాజాగా, మా నాన్న నాస్తికుడు అంటూ పవన్‌ చేసిన కామెంట్లపై కూడా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. నిన్న ఓ కార్యక్రమంలో మాట్లాడిన జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్.. మా నాన్న నాస్తికుడు.. మా నాయనమ్మ దీపారాధన చేస్తే సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు.. దెయ్యం లేడు అనే వాడు.. కానీ, ఆ తర్వాత కాలంలో తానేదో తప్పు చేశానని ప్రతి రోజూ బాధపడేవారు.. అందుకే ఇది మన సంప్రదాయం అని గుర్తించాలి, మన సంప్రదాయాలను గౌరవించాలని వ్యాఖ్యానించారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Jamuna: అలనాటి నటి జమునకు ప్రముఖుల నివాళులు

అయితే, పవన్‌ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ?” అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేనాని ఈ వ్యాఖ్యలు చేశారు.. ఇక, వైసీపీనే కాదు.. ఏ పార్టీ నేత అయినా మళ్లీ వేర్పాటు వాదం గురించి మాట్లాడితే నా అంత తీవ్రవాది ఉండడని పవన్‌ హెచ్చరించారు.. ఎవడికి వాడు రాష్ట్రం కావాలంటూ స్టేట్మెంట్లు ఇస్తారా..? మీరేం చేశారు.. మీరేమన్నా త్యాగాలు చేశారా..? అంటూ నిలదీసిన ఆయన.. నాది బాధ కాదు.. ఆవేదన అన్నారు.. దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు చేస్తే జనసేన ఊరుకోదని వార్నింగ్‌ ఇచ్చిన ఆయన.. ఏపీ భవిష్యత్ బాగుంటుంది.. జనసేనకు అండగా నిలవండి.. రాజకీయ వ్యూహాలు నాకు వదిలేయండి.. ఏపీ భవిష్యత్తు గురించి వ్యూహాలు ఉంటాయి.. కానీ.. నా గురించి వ్యూహాలు ఉండవని పవన్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

Show comments