Site icon NTV Telugu

Ambati Rambabu: కుప్పం చేతిలోంచి జారిపోతుందని చంద్రబాబుకు భయం పట్టుకుంది..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: కుప్పం తన చేతిలోంచి జారిపోతుందని చంద్రబాబుకు భయం పట్టుకున్నట్లు ఉందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 33 ఏళ్లుగా కుప్పం శాసనసభ్యుడిగా ఉన్న ఆయన.. ఈ మధ్యే కుప్పం వెళ్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో చంద్రబాబుకి గెలుపే లేదన్నారు. మున్సిపల్, జిల్లా పరిషత్, సర్పంచ్.. ఏ ఎన్నికలో అయినా డిపాజిట్లు రాలేదన్నారు. 33 ఏళ్లు నిన్ను మోసిన కుప్పానికి నువ్వు ఏమి చేసావు అంటూ చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. గాలేరు నగరికి జగన్ నిధులు ఇవ్వలేదట…నువ్వేమి చేశావ్?.. కనీసం కుప్పం కెనాల్ కూడా పూర్తి చేసుకోలేక పోయావంటూ ఆరోపించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. కుప్పంలో కూడా పార్టీ, ప్రాంతం అనేది లేకుండా సంక్షేమ ఫలాలు అందించారని అన్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు తమ వాణిని వినిస్తున్నారన్నారు.

Chandrababu Kuppam Tour: కుప్పానికి నీళ్లివ్వని ముఖ్యమంత్రి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు..

లోకల్ బాడీ ఎన్నికల్లో వంగి నమస్కారం పెట్టినా ఫలితం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. అవసరం కోసం చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లారని ఆయన అన్నారు. కనీసం ఈ 33 ఏళ్లలో కనీసం ఇల్లు కూడా అద్దెకు తీసుకోలేదన్నారు. కుప్పం ప్రజల గళాన్ని విని బెంబేలెత్తి పర్యటనలు చేస్తున్నారని.. కుప్పం కూలే పరిస్థితి వచ్చిందని.. ఇది వాస్తవమన్నారు. వైసీపీ కార్యకర్తలు వారి ఇళ్లపై జెండాలు కట్టుకుంటే ఏమిటి మీ బాధ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరొస్తుంటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు కూడా మీకు స్వాగతం పలకాలా…? జెండాలు పీకేసుకోవాలా..? అంటూ ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైసీపీ జెండాలను పీకించి దౌర్జన్యం చేస్తారా అంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు ఆ చర్యలకు పాల్పడ్డారు కాబట్టే వైసీ నాయకులు రియాక్ట్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనతో సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిది ఆరిపోయే దీపం చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినంత సులభం కాదన్నారు. 175 సీట్లు గెలుస్తాం అన్నా మాట ఇప్పుడు మీకు అర్దం అవుతుందా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఈ మూడు రోజులు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్దం అవుతుందన్నారు. కుప్పం జారిపోతుంది…కూలిపోతుంది అనే ఆవేదన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Exit mobile version