YSRCP: ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనూహ్యంగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గురువారం ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సురేష్ వీల్ ఛైర్‌లో ఉన్న ఫోటోను వైద్యులు విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది.
Read Also: Ram Gopal Varma: ఏపీ రాజకీయాల నేపథ్యంలో వర్మ రెండు సినిమాలు
కాగా అభివృద్ధి వికేంద్రీకరణపై ఇటీవల మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతమవుతుందని చెప్పారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. రాజధాని విషయంలో రైతులను టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లుగా అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ తీసుకొచ్చిన వికేంద్రీకరణ పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆమోదించారని.. వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
