Site icon NTV Telugu

Meruga Nagarjuna: చంద్రబాబుది కుట్ర రాజకీయం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ‌ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని‌ కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.

ఈ పథకాన్ని ఆపాలనా చంద్రబాబు ఉద్దేశం..? రైతు భరోసా ద్వారా రూ. 20162 కోట్లు రైతులకి అందిస్తుంటే ఈ పధకాన్ని అందకుండా చేయాలని టీడీపీ కుట్ర. చేస్తోందన్నారు. రూ. 9180 కోట్లు చేయూత ద్వారా అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలనా మీ కుట్రలు..? అని మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. 78.75 లక్షల వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 12756 కోట్లు అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.

31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం ఆపడానికి కోర్డులకి వెళ్లారు. నాడు నేడులో పాఠశాలలు, ఆసుపత్రులు తీర్చి దిద్దుతుంటే ఆ పధకాన్ని ఆపాలని కుట్రలు జరుగుతున్నాయి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీనిచ్చి చేతులెత్తేసింది చంద్రబాబు కాదా..? అని మంత్రి నాగార్జున ప్రశ్నించారు. పేదల అండగా ప్రభుత్వం సంక్షేమ‌ పధకాలు అమలు చేస్తుంటే ఎందుకీ కుట్రలు చేస్తున్నారు..? ఈ పథకాలన్నీ ఆపాలని పక్కా ప్రణాళికతో విషం చిమ్ముతున్నారు.

కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ‌పధకాలే నిరుపేదలకి అండగా నిలిచింది వాస్తవం కాదా..? సీఎం వైఎస్ జగన్ నేరుగా ప్రజలకే రూ. 1.40 కోట్లు డీబీటీ ద్వారా అందించడం తప్పా..? 70 శాతం మంత్రి పదవులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సీఎం వైఎస్ జగన్ అవకాశమిస్తే నీ క్యాబినెట్లో ఎస్టి, మైనార్టీలకి అవకాశమే ఇవ్వలేదన్నారు మంత్రి నాగార్జున.

Read Also:MP Santosh Kumar: మట్టిని కాపాడుకుందాం.. మొక్కను బతికించుకుందాం

Exit mobile version