NTV Telugu Site icon

Mekathoti Sucharitha: సుచరిత వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదేనా..?

Mekathoti Sucharitha

Mekathoti Sucharitha

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాజకీయంగా మా మనుగడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే అని స్పష్టం చేస్తూనే.. నేను ఆ స్టేట్‌మెంట్ ఇచ్చానంటే నా భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారన్నారు.. అయితే, అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే.. ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్లాల్సిందేగా? అందుకే.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తానని చెప్పుకొచ్చారు.. ఇక, నా భర్త ఒక పార్టీలో.. నేను మరొక పార్టీలో.. మా పిల్లలు ఇంకో పార్టీలో ఉండరని స్పష్టం చేశారు.. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్లు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే ఉండాలనుకున్నామని గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు మాజీ హోంమంత్రి మేకతేటి సుచరిత. అయితే, ఉన్నట్టుండి సుచరిత ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? అనే చర్చ వైసీపీలో ఆసక్తికరంగా మారిపోయింది.

Read Also: Mekathoti Sucharitha: మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు.. నా భర్త పార్టీ మారితే నేనూ వెళ్తా..

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లో మేకతోటి సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.. కానీ, వైఎస్‌ జగన్‌ రెండో కేబినెట్‌లో మాత్రం ఆమెకు చోటు దక్కలేదు.. దీనిపై బహిరంగంగానే ఆమె పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి.. సుచరితను మంత్రివర్గంలో కొనసాగించాలంటూ ఆమె అనుచరులు ఆందోళనలు కూడా చేశారు.. ఏకంగా ఎమ్మెల్యే పదవికి కూడా ఆమె రాజీనామా చేశారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి.. ఇక, ఆమెకు గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ బాధ్యతలు ఇచ్చినా.. అనారోగ్య సమస్యలున్నాయి.. నేను ఆ పదవిని నిర్వహించలేనంటూ ఆమె తిరస్కరించారు.. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిగా ఉన్న సుచరిత భర్త దయాసాగర్‌.. ఈ మధ్యే రిటైర్మెంట్‌ తీసుకున్నారు. కాకుమానులో జరిగిన వైసీపీ సమావేశంలో.. దయాసాగర్, సుచరిత ఇదరూ పాల్గొన్నారు.. ఆయన సమక్షంలోనే.. రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారామె.. దీంతో, సుచరిత వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? దయాసాగర్‌.. మరోపార్టీలో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా? అక్కడ సీటు పక్కా అయితే.. వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తారా? రిటైర్మంట్‌ చేసుకున్న దయాసాగర్‌.. పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారా? ఆయన అడుగుజాడల్లోనే ఆమె కూడా పార్టీ మారతారా? ఇలా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.