NTV Telugu Site icon

Mekathoti Sucharitha: అది రాజీనామా కాదు.. థ్యాంక్స్ గివింగ్ నోట్

ఏపీలో కేబినెట్ ప్రక్షాళన అనంతరం కొన్నిచోట్ల అసంతృప్తులు బయటపడ్డాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అసహనంతో వున్నారని, ఆమె రాజీనామా చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ సీఎం జగన్‌ తో భేటీ అయ్యారు సుచరిత. పార్టీ, సీఎం జగన్ ఎంతో గౌరవించి.. పదవులు కట్టబెట్టారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అన్నారు.

కొంత మందిని తొలగిస్తామని.. కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని జగన్ చెప్పారు. మమ్మల్ని కెబినెట్ నుంచి తొలగించే పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ పడితే.. నేనే ఫర్వాలేదు.. బాధ పడొద్దని చెప్పాను. మంత్రి పదవి నుంచి తప్పించినప్పుడు కొంత భావోద్వేగానికి గురయ్యాను. నేను థ్యాంక్స్ గివింగ్ నోట్ ఇస్తే.. అది రాజీనామా లేఖగా పొరపాటు పడ్డారు.

Also Read:Kendriya Vidyalaya: విద్యార్ధులకు షాక్.. ఎంపీ కోటా సీట్ల ఎత్తివేత
ఈ ఎపిసోడుకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నా. సీఎం జగన్ నన్ను చెల్లిగా చూశారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటాను. రాజకీయాలకు దూరంగా ఉండదల్చుకుంటే వైసీపీ కార్యకర్తగా.. ఓటరుగానే ఉంటాను. 2009 నుంచి జగన్ వెన్నంటే నడిచాను. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. మా అమ్మాయి పొరపాటున ఏదో మాట్లాడింది. ఓ చిన్న పిల్ల మాటను పట్టుకుని ఇంత ఇష్యూ చేయడం సరి కాదు. అయినా అప్పుడే పక్కనున్న మా అబ్బాయి థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని చెబుతున్నాడు.. కానీ దాన్ని హైలైట్ చేయలేదన్నారు సుచరిత.

సీఎం జగనుతో ఫ్యామ్లీ మెంబర్సుతో వచ్చి కలిసే స్వేచ్ఛ ఉంది. నాకు ఆరోగ్యం సరిగా లేదు.. దీన్ని ఎండ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇబ్బందైనా వచ్చా. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నేను నడుచుకుంటానన్నారు మేకతోటి సుచరిత.