ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందర్నీ శోక సంద్రంలో ముంచెత్తింది.. ఎంతో భవిష్యత్ ఉన్న నేత.. మరణాన్ని అటు కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక, ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి.. అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నా.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి..
Read Also: Adimulapu Suresh: ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు.. 2024లోనే పోల్స్..
మేకపాటి గౌతమ్ రెడ్డి వారసుడిగా మా రెండో అబ్బాయి విక్రమ్‌ను నిర్ణయించాం అని తెలిపారు మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఎన్నికల షెడ్యూలు వస్తే మిగతా విషయాలు బయటకు వస్తాయన్న ఆయన.. షెడ్యూల్ వచ్చిన తర్వాతే ఎవరెవరు పోటీలో ఉంటారో తెలుస్తుందన్నారు. అయితే, నియోజకవర్గానికి వెళ్లే ముందు సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు తీసుకోవడానికి విక్రమ్‌ను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. ఇక, విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నాను.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్తానన్నారు. నియోజకవర్గానికి అన్న చేయాలనుకున్నది నేను చేసి చూపిస్తానని ప్రకటించారు మేకపాటి విక్రమ్‌రెడ్డి. ఇక, ఈ భేటీలో సంగం బ్యారేజ్ కు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెట్టనున్నట్లు గతంలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.