NTV Telugu Site icon

RIP Mekapati Goutham Reddy: రేపు ఆర్మీ హెలికాప్టర్‌లో భౌతికకాయం తరలింపు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఆర్మీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు తరలించనున్నారు.. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆయన హుటాహుటిన జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.. గౌతమ్‌రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలారని వైద్యులు ప్రకటించారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారని.. ఆస్పత్రికి వచ్చేసరికే స్పందించని స్థితిలో ఉన్నారని తెలిపారు.. అయితే, రేపు ఉదయం ఆర్మీ హెలికాప్టర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. రేపు ఉదయం 8.30 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించి.. నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు.. ఇక, ఎల్లుండి ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర సాగనుండగా.. ఎల్లుండి మధ్యాహ్నం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు..

Read Also: Anil Kumar: సొంత అన్నను కోల్పోయినట్టు ఉంది.. వివాదాలులేని వ్యక్తి మేకపాటి..

ఎల్లుండి ఉదయం స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు మేకపాటి గౌతమ్‌రెడ్డి అని గుర్తుచేశారు.. సీఎం జగన్‌తో అత్యంత సన్నిహితుడుగా ఉన్నారని.. ఈరోజు అయన లేరు అని విషయాన్ని నమ్మలేకపోతున్నాం అన్నారు.. ఎల్లుండి ఉదయం స్వగ్రామంలో అంతిమ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం ఇస్తామని తెలిపిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.