Home
Andhra Pradesh News
Mekapati Family On Rumours In Social Media About Mekapati Goutham Reddy Death
Goutham Reddy passes away: మృతిపై అసత్య ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదస్త్రశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది.. నిజాలకంటే ముందుగా అబద్దాలు ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయాయి.. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వదంతులపై మంత్రి మేకపాటి కుటుంబం స్పందించింది.. ఆయన వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేసింది.. రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నపట్టి నుంచి ఆయన ఉదయం ఇబ్బంది పడడం.. ఆస్పత్రికి తరలించడం.. ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించేవరకు జరిగిన అన్ని విషయాలను టైంతో సహా క్లారిటీ ఇచ్చింది మేకపాటి ఫ్యామిలీ..
Read Also: KCR: బంగారు భారత దేశాన్ని తయారు చేద్దాం..
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
మేకపాటి గౌతమ్‌రెడ్డి ఫ్యామిలీ ప్రకటన ప్రకారం..
- రాత్రి జరిగిన ఓ ఫంక్షన్లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా గౌతమ్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
- రోజూలాగే ఉదయం 6 గంటలకు మేల్కొన్నారు..
- ఉదయం 6.30 గంటల వరకూ ఫోన్లతో కాలక్షేపం
- ఉదయం 7 గంటలకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో కూర్చుని ఉన్న మంత్రి మేకపాటి
- ఉదయం 7:12కి అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పిన గౌతమ్ రెడ్డి
- ఉదయం 07:15కి హఠాత్తుగా గుండెపోటుతో సోఫా నుంచి మెల్లిగా కిందకి ఒరిగిన మంత్రి.
- ఉదయం 7:16కి కంగారు పడి గట్టిగా అరిచిన మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి
- ఉదయం 7:18కి పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న గౌతమ్‌రెడ్డి ఛాతిమీద చేయితో నొక్కి స్వల్ప ఉపశమనం కలిగించిన డ్రైవర్ నాగేశ్వరరావు
- ఉదయం 7:20కి మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తం
- ఉదయం 7:20కి మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో.. మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచిన భార్య శ్రీకీర్తి
- ఉదయం 7:22కి “నొప్పి పెడుతుంది కీర్తి” అంటున్న మంత్రి మాటలకు స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరిన మంత్రి సిబ్బంది
- ఉదయం 7:27కి మంత్రి ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి అపోలో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి చేర్చిన మంత్రి మేకపాటి డ్రైవర్,సిబ్బంది ( 3 కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లోనే)
- ఉదయం 8:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని తెలిపిన అపోలో వైద్యులు
- ఉదయం 9:13కి మంత్రి మేకపాటి ఇక లేరని నిర్ధారించిన అపోలో ఆస్పత్రి వైద్యులు
- ఉదయం 9:15కి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించిన అపోలో వైద్యులు
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!