Site icon NTV Telugu

Mega Fans Protest: క్షమాపణ చెప్పినా తప్పడంలేదు.. నారాయణకు ‘మెగా’ సెగ..

Mega Fans Protest

Mega Fans Protest

మెగాస్టార్‌ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ క్షమాపణ చెప్పినా.. ఆయనకు మాత్రం నిరసన సెగ తప్పడంలేదు.. కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారాయణకు మెగా అభిమానుల నుంచి నిరసన ఎదురైంది.. ఆలమూరు మండలం బడుగువానిలంకలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, బాధితుల పరామర్శకు వెళ్తున్న నారాయణను అడ్డుకోవడానికి యత్నించారు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు.. చిరంజీవి పై నారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.. చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. నారాయణ బుద్ది గడ్డి తిందని నినాదాలు చేశారు.. బ్రోకర్‌ నారాయణ అంటూ మండిపడ్డారు.. అయితే, నారాయణ క్షమాపణ చెప్పేశారని.. ఆయన వెంట ఉన్న కార్యకర్తలు చెప్పినా వారు వెనక్కి తగ్గలేదు.. అప్పటికే ఆయన పడవ ఎక్కి వెళ్లిపోయినా.. బ్రోకర్‌ నారాయణ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు మెగా ఫ్యాన్స్‌..

Read Also: CPI Narayana apology: చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా..

కాగా, చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలు భాషా దోషంగా భావించాలని నారాయణ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోండి అని కోరారు.. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు, సద్విమర్శలు చేస్తుటాం.. చిరంజీవి గతంలో రాజకీయాల్లో ఉన్నారు.. రాజకీయాల్లో విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకోవాలి.. కానీ, నేను ఆ పరిధి దాటి వ్యాఖ్యలు చేశాను.. అనకూడని మాటలు అన్నానని.. ఆయనపై తాను అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదన్నారు నారాయణ.. ఇక, వరద బాధితులను ఆదుకోవడం కోసం అందరూ కలిసి పని చేద్దాం అని కోరిన విషయం తెలిసిందే.

Exit mobile version