NTV Telugu Site icon

రఘురామ కాలిపై గాయాలు లేవు.. స్పష్టం చేసిన మెడికల్ రిపోర్టు

MP Raghu Rama

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు వ్య‌వ‌హారం క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. న‌న్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు ర‌ఘురామ‌.. దీనిపై మెడిక‌ల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచార‌ణ సంద‌ర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడిక‌ల్ రిపోర్టును చ‌దివి వినిపించింది డివిజ‌న్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవ‌న్నీ తాజా గాయాలు కావ‌ని పేర్కొంది. ర‌ఘురామ పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యుల నివేదిక పేర్కొంది. మ‌రోవైపు.. రమేష్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాల‌ని పేర్కొంది.. అయితే, ర‌మేష్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌న్న ఆదేశంపై ఏఏజీ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.. ఆ ఆస్ప‌త్రిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని వాదించారు.. ర‌మేష్ ఆస్ప‌త్రికి తీసుకెళితే.. టీడీపీ ఆఫీసుకు తీసుకెళ్లిన‌ట్టేన‌ని ఏఏజీ వాదించారు.. ర‌మేష్ ఆస్ప‌త్రి నిర్ల‌క్ష్యంతో 10 మంది మృతిచెందార‌ని పేర్కొన్నారు. అయితే, ఈ అభ్యంత‌రాలో మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌మ‌ని ఏఏజీకి సూచించింది హైకోర్టు.