Site icon NTV Telugu

Mass Copying: ఇంటర్ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌

Mass Copying

Mass Copying

Mass Copying: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల మాస్ కాపీయింగ్‌ కలకలం సృష్టిస్తోంది.. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు జగ్గయ్యపేటలో పరీక్షలకు హాజరవుతున్నారు.. ముడు సెంటర్లలో దాదాపు 700 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.. జగ్గయ్యపేట ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, ఓపెన్ ఇంటర్ పరీక్షల లో జవాబు పత్రాలు అందిస్తామంటూ విద్యార్థికి రూ.15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి..

Read Also: KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్

ఇక, డబ్బులు తీసుకున్న యాజమాన్యం.. హాల్ టికెట్ పొందిన విద్యార్థులు కాకుండా మరొకరితో పరీక్షలు రాయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ బహిరంగ సత్యమేనంటున్నారు విద్యార్థులు. ఉన్నతాధికారిల నుండి ఇన్విజిలేటర్ల వరకు చిల్లర పంపిణీ చేసిన నిర్వాహకులు. జవాబు పత్రాలను జిరాక్స్ తీసి అందిస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం, నిర్వాహకుల తీరు బయటకు వచ్చినా.. అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు విద్యార్థులు మండిపడుతున్నారు..

Exit mobile version