NTV Telugu Site icon

Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..

Woman Harassed

Woman Harassed

Married Woman Harassed By Relative In Chittoor: మానవత్వం మంటగలిసిపోతోంది. అయిన వాళ్లతోనే కొందరు దుర్మార్గులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వివావరసలు మరిచి, కామకోరికలు తీర్చాలంటూ హద్దుమీరి రెచ్చిపోతున్నారు కామాంధులు. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాగే బరితెగించాడు. వరుసకు తల్లి అయ్యే ఓ వివాహితని తనతో సహజీవనం చేయమంటూ ఒత్తిడి చేశాడు. ఆమె వద్ద నుంచే డబ్బులు దోచుకొని మరీ, ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. చిత్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Mangoes stolen: ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు..కట్ చేస్తే కిలో రూ.2.5 లక్షల విలువైన మామిడి పండ్లు చోరీ

చిత్తూరులోని సదుం మండలం, ఉటుపల్లెలో ఓ వివాహిత నివసముంటోంది. ఆమెకు వరుసకు కొడుకు అయ్యే నాగరాజు అనే యువకుడు అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఉంటున్నాడు. కొంతకాలం క్రాతం మాయమాటలు చెప్పి, ఆమె వద్ద నుంచి బంగారు ఆభరణాలతో పాటు రూ.80 వేల నగదు తీసుకున్నాడు. త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చాడు. అయితే.. రోజులు, నెలలు గడుస్తున్నా నాగరాజు ఆమెకు డబ్బులు, నగలు తిరిగివ్వలేదు. దీంతో.. ఆ వివాహిత అతడ్ని నిలదీసింది. తన డబ్బులు, నగలు తిరిగి ఇచ్చేయాలని అడిగింది. అప్పుడే నాగరాజు తన అసలు రూపం బయటపెట్టాడు. వరుసకు తల్లి అయినప్పటికీ.. ఎప్పట్నుంచో ఆమెపై కన్నేసిన నాగరాజు ఆమె ముందు ఓ షాకింగ్ కండీషన్ పెట్టాడు.

Milk Shake: మిల్క్ షేక్ తాగుతున్నారా..? ఆరోగ్యం జర జాగ్రత్త..!

డబ్బులు, నగలు తిరిగి కావాలంటే.. తనతో సహజీవనం చేయాలని నాగరాజు ఆ వివాహితకు చెప్పాడు. తాను కోరినప్పుడల్లా కామవాంఛ తీరుస్తేనే.. డబ్బులు, నగలు ఇస్తానని అన్నాడు. దీంతో ఖంగుతిన్న ఆ మహిళ.. ‘నువ్వు వరుసకు నాకు కొడుకు అవుతావ్, ఈ పాడు ఆలోచన ఏంటి’ అని నిలదీసింది. అయినా అతడు మారకుండా, సహజీవనం చేయాల్సిందేనన్నాడు. దాంతో చేసేదేమీ లేక.. ఆ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Show comments