Margani Bharath Ram: అతడో అరిటాకు, సర్కస్‌లో బఫూన్.. ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharath Ram Sensational Comments On Raghurama Krishnam Raju: ఎంపీ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు ఉంటేనే రఘురామ నోట్లో నుంచి మాటల రావని.. ఆయనో అరిటాకు, సర్కస్‌లో బఫూన్ అని విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు ఒక కమెడియన్ అని, ఆయన క్యారెక్టర్ మహాభారతం ఇతిహాసంలో శిఖండి పాత్ర లాంటిదని పేర్కొన్నారు. తనని ఉద్దేశించి ఆయన ఏదేదో వాగుతున్నాడని, ఆ అరిటాకు గురించి ఎక్కువ మాట్లాడి తన సమయాన్ని వృధా చేసుకోలేనని అన్నారు. గౌరవం ఇవ్వడం అంటే అడిగి తీసుకోవడం కాదని, వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించబడతారని హితవు పలికారు. ఆ ఎంపీకి వ్యక్తిత్వం లేదని, నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తుంటారని ఆరోపించారు.
Mukesh Kumar Meena: ఎమ్మెల్సీ ఎన్నికలపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
రఘురామకృష్ణంరాజు ఢిల్లీ దాటి బయటకు రాలేడని.. ఇద్దరు ముగ్గురు మీడియా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏదేదో వాగడం తప్ప, తమలాగా ధైర్యంగా బయటకు రాలేడని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గానికి కాదు కదా.. కనీసం ఏపీలో కూడా అడుగుపెట్టలేడని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కి కూడా రాలేని ఆయన ఒక అజ్ఞాతవాసి అని, అరిటాకు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆయన పేరే వస్తుందని విమర్శనాస్త్రాలు సంధించారు. ఏదైనా సినిమాలో బఫూన్‌గా నటిస్తే.. డబ్బులైనా వస్తాయంటూ వ్యంగాస్త్రాలు చేశారు. తాను లోకేష్‌ని ఏదో అన్నానని రఘురామ చెప్తున్నారని.. లోకేష్ ఓ కమెడియన్ అని ఇప్పుడు కూడా చెప్తానన్నారు. సీఎం జగన్ ఓ రియల్ హీరో అని పేర్కొన్నారు. ‘‘ఇప్పటికీ చెబుతున్నాను, నటించాలనుకుంటే పది సినిమాల్లో హీరోగా నటిస్తా, నువ్వూ నటించగలవు కానీ బఫూన్‌లాగా’’ అంటూ చెప్పుకొచ్చారు. రఘురామకు పెద్దగా మేకప్ వేయాల్సిన అవసరం లేదని.. ఆ గోచీ, మొహం చూస్తే అచ్చం సర్కస్‌లో చిన్నప్పుడు తాము చూసిన బఫూన్లాగే ఉంటారని విరుచుకుపడ్డారు.
Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..