NTV Telugu Site icon

Margani Bharath Ram: అతడో అరిటాకు, సర్కస్‌లో బఫూన్.. ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు

Margani Bharath Ram

Margani Bharath Ram

Margani Bharath Ram Sensational Comments On Raghurama Krishnam Raju: ఎంపీ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెత్తిన విగ్గు, చేతిలో పెగ్గు ఉంటేనే రఘురామ నోట్లో నుంచి మాటల రావని.. ఆయనో అరిటాకు, సర్కస్‌లో బఫూన్ అని విమర్శలు గుప్పించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు ఒక కమెడియన్ అని, ఆయన క్యారెక్టర్ మహాభారతం ఇతిహాసంలో శిఖండి పాత్ర లాంటిదని పేర్కొన్నారు. తనని ఉద్దేశించి ఆయన ఏదేదో వాగుతున్నాడని, ఆ అరిటాకు గురించి ఎక్కువ మాట్లాడి తన సమయాన్ని వృధా చేసుకోలేనని అన్నారు. గౌరవం ఇవ్వడం అంటే అడిగి తీసుకోవడం కాదని, వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించబడతారని హితవు పలికారు. ఆ ఎంపీకి వ్యక్తిత్వం లేదని, నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తుంటారని ఆరోపించారు.

Mukesh Kumar Meena: ఎమ్మెల్సీ ఎన్నికలపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కీలక వ్యాఖ్యలు

రఘురామకృష్ణంరాజు ఢిల్లీ దాటి బయటకు రాలేడని.. ఇద్దరు ముగ్గురు మీడియా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏదేదో వాగడం తప్ప, తమలాగా ధైర్యంగా బయటకు రాలేడని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గానికి కాదు కదా.. కనీసం ఏపీలో కూడా అడుగుపెట్టలేడని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌కి కూడా రాలేని ఆయన ఒక అజ్ఞాతవాసి అని, అరిటాకు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆయన పేరే వస్తుందని విమర్శనాస్త్రాలు సంధించారు. ఏదైనా సినిమాలో బఫూన్‌గా నటిస్తే.. డబ్బులైనా వస్తాయంటూ వ్యంగాస్త్రాలు చేశారు. తాను లోకేష్‌ని ఏదో అన్నానని రఘురామ చెప్తున్నారని.. లోకేష్ ఓ కమెడియన్ అని ఇప్పుడు కూడా చెప్తానన్నారు. సీఎం జగన్ ఓ రియల్ హీరో అని పేర్కొన్నారు. ‘‘ఇప్పటికీ చెబుతున్నాను, నటించాలనుకుంటే పది సినిమాల్లో హీరోగా నటిస్తా, నువ్వూ నటించగలవు కానీ బఫూన్‌లాగా’’ అంటూ చెప్పుకొచ్చారు. రఘురామకు పెద్దగా మేకప్ వేయాల్సిన అవసరం లేదని.. ఆ గోచీ, మొహం‌ చూస్తే అచ్చం సర్కస్‌లో చిన్నప్పుడు తాము చూసిన బఫూన్‌లాగే ఉంటారని విరుచుకుపడ్డారు.

Girlfriend Attacks: మోసం చేసిన ప్రియుడు.. సలసల కాగే నూనెతో ప్రియురాలు దాడి

Show comments