Site icon NTV Telugu

Margani Bharath : దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబేట్‌కు రెడీ

చంద్రబాబు పోలవరం బ్యారేజీ కడదామనే భ్రమలో ఉన్నారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. అందుకే పోలవరం బ్యారేజీ అంటున్నారని, మేము కడుతుంది పోలవరం ప్రాజెక్టేనని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు. ఒక్క క్యూసెక్కు నీరు చుక్క తగ్గకుండా నీరు స్టోరేజ్ చేస్తామని, చంద్రబాబు తప్పిదాలు కారణంగా డయాఫ్రం వాల్ పునఃనిర్మాణం చేయాల్సి వస్తుందన్నారు.

రాజమండ్రి నగరంలో 35 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం, రెండు నెలల్లో రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణానికి రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. 80 లక్షల రూపాయల వ్యయంతో
తాడితోట నుండి కంబాలచెరువు వరకు రోడ్డు పునఃనిర్మాణ పనులను ఎంపీ భరత్‌ ప్రారంభించారు.

https://ntvtelugu.com/yanamala-ramakrishnudu-about-high-court-verdict/
Exit mobile version