Hidma History: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. హిడ్మా మృతితో మావోయిస్టు దళాలకు గట్టి దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నప్పటికీ, అతను గతంలో జరిపిన దాడుల గురించి తెలిసిన విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే, హిడ్మా మొత్తం 26 దాడుల్లో ప్రత్యక్ష పాత్ర పోషించిన కీలక నిందితుడిగా ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా భద్రతా బలగాలపై దాడులకు నాయకత్వం వహించాడు.
Read Also: Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్
అయితే, భద్రతా దళాలు హిడ్మా పేరు వినగానే అలర్ట్ మోడ్‌లోకి వెళ్లే పరిస్థితి ఉండేది. హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే అనే వ్యాఖ్యలు వినిపించాయి. అతని దాడుల విధానం, దాడులు చేసేందుకు వేసే ప్రణాళికలు అలా ఉండేవి. ఇక, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టుల్లో భయం మొదలైంది, అతని మరణం తర్వాత మావోయిస్టుల అంతర్గత వ్యవస్థలో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి.
హిడ్మా స్కెచ్ వేస్తే శత్రువులకు నూకలు చెల్లినట్లే..!
* మొత్తం 26 దాడుల్లో కీలక నిందితుడిగా హిడ్మా..
* 2007లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఉర్పల్మెట్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి పలువురిని హతమార్చడం ద్వారా హిడ్మాకు మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..
* 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి..
* 2013లో జీరామ్ ఘాటీ దగ్గర కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీ రోల్..
* 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చింపేసిన హిడ్మా..
* 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతి ..
