Site icon NTV Telugu

Mansukh Mandaviya: విజయనగరం జిల్లాలో కేంద్రమంత్రి టూర్

Mansuk

Mansuk

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్ షుఖ్ మాండవీయ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలును పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి మాండవీయ. గుంకళాంలో ఇళ్ల నిర్మాణం, గొట్లాంలో నాడు- నేడు కార్యక్రమంలో నవీకరించిన పాఠశాలను, కుమిలిలో రైతు భరోసా కేంద్రాన్ని, ఎం.డి.యు. నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాన్ని పరిశీలించనున్నారు కేంద్ర మంత్రి. అలాగే, జిల్లా కేంద్ర ఆసుపత్రిని, రామతీర్థంలో ఆలయాన్ని సందర్శించనున్నారు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ వివిధ రాష్ట్రల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలోనూ కరోనా కట్టడికి చేపట్టవలసిన చర్యలను, జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ గురించి ఆయన అధికారలతో సమీక్షించనున్నారు.

Read Also:Prashant Kishor: పీకే చుట్టూ.. తెలంగాణ పాలిటిక్స్..!

Exit mobile version