NTV Telugu Site icon

Manda Krishna Madiga: బిల్లు పెట్టకపోతే మా సత్తా చూపిస్తాం.. మందకృష్ణ హెచ్చరిక

Mandakrishna Madiga

Mandakrishna Madiga

Manda Krishna Madiga Warns Central Govt Over SC Bill: పార్లమెంటులో ఎస్సీ బిల్లు పెట్టకపోతే.. తమ సత్తా చూపిస్తామని ఎమ్‌ఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ప్రకాశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా పదే పదే హామీలు ఇవ్వటం కన్నా, పార్లమెంటులో బిల్లును పెట్టాలని ప్రధాని మోడీని కోరుతున్నామన్నారు. పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ఉన్నా.. బీజేపీ కేవలం మాటలకే పరిమితం అయ్యిందన్నారు. 2013లోనే బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎస్సీ వర్గీకరణకు మద్దతునిస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అన్నీ రాజకీయ పార్టీలు కూడా లేఖలు ఇచ్చాయన్నారు. వచ్చే పార్లమెంటు సమయంలో తనని కలవాలని మోడీ కబురు చేయించారన్నారు. దళితుల మీద దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాడులు కనిపించలేదని దుయ్యబట్టారు.

Tana President: వాషింగ్టన్ డీసిలో అంబరాన్నంటిన కొడాలి నరేన్ ఆత్మీయుల కోలాహలం

అంతకుముందు.. వరంగల్‌లో ప్రధాని మోడీ పర్యటించిన సందర్భలో మందకృష్ణ మాదిగ కలవడం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణను మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ గురించి మోడీ వద్ద మందకృష్ణ ప్రస్తావించినట్టుగా తెలిసింది. ప్రధాని మోడీ తనకోసం ప్రత్యేక సమయం తీసుకొని కలిశారని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ తనను ఎంతో ప్రేమతో హత్తుకొని ఆత్మీయంగా పలకరించారని.. ఈ భేటీలో ఆయన వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత అంశం మీద చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. అయితే.. ఈ భేటీ అయిన రెండు రోజుల తర్వాత మోడీపై మందకృష్ణ విరుచుకుపడ్డారు. సామాన్య కార్యకర్త నుండి ప్రధాని మోడీ వరకు వర్గీకరణకు అనుకూలమని చెబుతూనే.. మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణ పట్ల హామీ ఇస్తూనే, పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇలాగే కాలయాపన చేస్తే.. బీజేపీపై నమ్మకం పెట్టుకున్న మాదిగలు విశ్వసించబోరని అసహనం వ్యక్తం చేశారు.

Delhi Rains: ఢిల్లీలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవు.. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం