Site icon NTV Telugu

AP Police humanity: భుజాలపై భార్య మృతదేహంతో భర్త.. మానవత్వం చాటిన ఏపీ పోలీసులు

Ap Police Humanity

Ap Police Humanity

AP Police humanity: ఆస్పత్రిలో కన్నుమూసిన భార్యను ఇంటికి చేర్చడానికి ఓ భర్త దగ్గర డబ్బు లేదు.. ఇక చేసేది ఏమీ లేదు.. గమ్యం మాత్రం చాలా దూరం.. అయినా కట్టుకున్న భార్య మృతదేహాన్ని తన ఊరికి చేర్చాలనుకున్నాడు.. విజయనగరం జిల్లాలోని నీరుకొండ ఆస్పత్రి నుంచి తన భార్య మృతదేహాన్ని భూజాలపై వేసుకొని బయల్దేరారు.. సమాచారం అందుకున్న విజయనగరం రూరల్‌ పోలీసులు మానవత్వం చాటుకున్నారు..

Read Also: PM Narendra Modi: ప్రజలు చేయలేనిది ఈడీ చేసింది.. కాశ్మీర్‌లో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన ఇదిగురు అనే మహిళ అనిల్ నీరుకొండ ఆసుపత్రిలో మృతి చెందింది.. మృతదేహాన్ని ఒడిశాలోని తన స్వగ్రామానికి తరలించడానికి భర్త దగ్గర డబ్బులు లేవు.. దీంతో.. భర్త.. ఇదిగురు మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ ఒడిశా కోరాపుట్టి జిల్లా పొట్టంగి బ్లాక్ కోసాదికి బయల్దేరారు.. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.. దీనిపై వెంటనే స్పందించిన విజయనగరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు, సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్.. హుటా హుటిన బయల్దేరి శవాన్ని మోసుకుంటు వెళ్లిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి.. వివరాలు సేకరించారు.. ఆ తర్వాత ఒక అంబులెన్సును ఏర్పాటు చేసి శవాన్ని వాళ్ల స్వగ్రామైన ఒడిశాకు తరలించారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ వ్యక్తి.. విజయనగరం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.. మొత్తంగా విజయనగరం పోలీసులు వెంటనే స్పందించి మానత్వం చాటడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version