Man Molested Married Woman In Tirupathi: కామాంధుల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు, వారిపై అఘాయిత్యానికి ఎగబడుతున్నారు. తమ ఇళ్లల్లోనూ మహిళలు ఉంటారన్న సంగతి మరిచి, ఇతర మహిళలపై రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. కొందరు మాయమాటలతో లొంగదీసుకొని మరీ, అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా తిరుపతిలోనూ ఇలాంటి దారుణ సంఘటనే చోటు చేసుకుంది. రుణం ఇప్పిస్తానని చెప్పి, ఓ మహిళను నిర్బంధించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. మహిళ ఫిర్యాదు మేరకు.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, జైల్లో పెట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Chiranjeevi: అల్లు- మెగా కుటుంబాల మధ్య విభేదాలు.. మొదటిసారి నోరువిప్పిన చిరు
తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఒక మహిళ తన కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమె ఒక పాఠశాలలో స్వీపర్‌గా పని చేస్తుంది. ఆ మహిళకు వెదురుకుప్పం మండలం బలిజిపల్లె దళితవాడకు చెందిన నాగరాజుతో పరిచయం ఉంది. పరిచయమైనప్పటి నుంచే నాగరాజు ఆమెపై కన్నేశాడు. లైంగికంగా అనుభవించాలని అనుకున్నాడు. అయితే, అదును కోసం వేచి చూశాడు. కట్ చేస్తే.. తనకు డబ్బులు అవసరమై, ఆ మహిళ ఒకరోజు తనకు బ్యాంకులో రుణం ఇప్పించాలని నాగరాజుని కోరింది. ఇదే అదునుగా భావించి, అతడు ఒక ప్లాన్ వేశాడు. నవంబర్ 17వ తేదీన బ్యాంకులో రుణం ఇప్పిస్తానని చెప్పి, ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఒక గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన వ్యక్తి వస్తాడని, బ్యాంకు రుణానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకుంటాడని మాయమాటలు చెప్పి, ఒక ఇంట్లోకి తీసుకెళ్లాడు.
Saudi Crown Prince: సౌదీ ప్రిన్స్ కీలక నిర్ణయం.. పాకిస్థాన్‌లో పెట్టుబడులను పెంచే దిశగా..
అంతే.. అందులో ఆమెను నిర్బంధించి, నెలరోజులపాటు అత్యాచారం చేశాడు. తనని వదిలిపెట్టమని ఆమె ఎంత ప్రాధేయపడినా ఆ కీచకుడు వదిలిపెట్టలేదు. చివరికి తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో, నాగరాజు ఆమెను విడిచిపెట్టాడు. ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ మహిళ.. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అయితే గ్రామస్తులు అండగా నిలవడంతో.. నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. దిశ పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.