Cyber Crime: రూ.35 వేలతో ఏసీ కొనుగోలు.. ఖాతాలోని 27 లక్షలు మాయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.. ఎక్కడ ఏం చేస్తే.. ఎవరి ఉచ్చులో చిక్కుకుంటామో తెలియని పరిస్థితి దాపురించింది.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా డిజిటల్ పేమెంట్స్ జరగుతున్నాయి.. అవే, కొందరి కొంప ముంచుతున్నాయి… తాజాగా, ఓ వ్యక్తి 35 వేల రూపాయలు పెట్టి ఏసీ కొనుగోలు చేయడమే ఆయన చేసిన పాపం అయ్యింది.. ఆ తర్వాత సదరు బాధితుడి ఖాతా నుంచి దఫదఫాలుగా 27 లక్షల రూపాయాలు మాయం అయ్యాయి… సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపించిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read
- Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
- YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
- Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్.ఆర్పి అగ్రహారానికి చెందిన చిగురుపల్లి నాగేశ్వర రావు.. హైదరాబాద్‌లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన నాగేశ్వరరావు.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 37 లక్షల రూపాయలను.. ఉండిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిపాజిట్ చేసుకున్నారు.. అయితే, ఏప్రిల్ నెలలో రూ.35 వేలతో ఏ.సీ. కొనుగోలు చేశారు.. ఇక, ఏసీ బిగించినందుకు మరో రూ. 8 వేలు చెల్లించారు.. ఈ రెండు మొత్తాలను ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేశారు నాగేశ్వరరావు.. ఇక, రెండు రోజుల క్రితం బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేద్దాం అనుకున్న ఆయన.. తన ఖాతాలోని సొమ్మును ఓసారి చెక్ చేసుకున్నారు.. ఆయన బ్యాంకు ఖాతా లో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఉండడంతో షాక్ తిన్నారు.. దీంతో.. తన బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము మాయం అయిన విషయాన్నిఆలస్యంగా గుర్తించిన నాగేశ్వరరావు.. ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Priyanka Gandhi: గోమూత్ర వ్యాఖ్యలపై అభ్యంతరం.. ప్రియాంకాగాంధీకి విద్యావేత్తల లేఖ
-
Google Pixel 11 సిరీస్‌లో కొత్త ట్విస్ట్.. లాంచ్‌కు కీలక ఫీచర్స్ లీక్..!
-
Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
-
Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
-
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!