NTV Telugu Site icon

Love Tragedy: చిత్తూరులో షాకింగ్ ఘటన.. వరుసకు కూతురయ్యే మైనర్ బాలికతో ఎఫైర్.. ఆ తర్వాత?

Man Minor Girl Affair

Man Minor Girl Affair

Man And Minor Girl Commits Suicide After Their Extramarital Affair Exposed: చిత్తూరు జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వరుసకు కూతురు అయ్యే మైనర్ బాలికతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం నడిపించాడు. వావివరసలు మరిచి, ఆ వ్యక్తి మైనర్ బాలికని తన మాయమాటలతో బుట్టలతో పడేసి, ఎఫైర్ నడిపాడు. చివరికి తమ విషయంలో ఇంట్లో తెలియడంతో, ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. షాక్‌కి గురిచేసే ఈ ఘటన పుంగనూరులో వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరులో నివాసముంటున్న గంగులయ్యకు పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరోవైపు.. నక్షత్ర అనే మైనర్ బాలిక పుంగనూరు బసవరాజా బాలికల కళాశాలలో 10వ తరగతి చదువుతోంది. గంగులయ్యకు నక్షత్ర వరుసకు కూతురు అవుతుంది.

Hyundai Exter Launch 2023: ఆహా అనేలా హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంటీరియర్.. అత్యాధునిక ఫీచర్లు! లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అయితే.. గంగులయ్య వావివరసలు మరిచి, నక్షత్రను మాయమాటలతో తన బుట్టలో పడేసి, ఆ బాలికతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. కొంతకాలం నుంచి వీళ్లిద్దరు ఎవ్వరికీ తెలియకుండా, గుట్టుగా తమ ఎఫైర్ నడుపుతున్నారు. అయితే.. వీరి ఎఫైర్ ఎంతోకాలం దాగి ఉండలేదు. వీరిద్దరు తరచుగా కలుస్తుండటం, ప్రవర్తనలోనూ మార్పు రావడాన్ని కుటుంబసభ్యులు గమనించారు. చివరికి.. వీళ్లిద్దరు అడ్డంగా దొరికిపోయారు. కుటుంబసభ్యులందరూ నిలదీయడంతో, వీళ్లిద్దరు మనస్తాపానికి గురయ్యారు. ముఖ్యంగా.. గుంగలయ్యను అందరూ నిలదీశారు. కూతురు వరుసయ్యే బాలికతో ఎలా ఎఫైర్ నడుపుతావంటూ మందలించారు. దీన్ని గంగులయ్య అవమానంగా భావించాడు. అటు, ఆ బాలిక కూడా తీవ్ర మనోవేదనకు గురైంది. వీరి వ్యవహారం పోలీస్ స్టేషన్‌దాకా కూడా వెళ్లింది.

Morphing Photos: నిశ్చితార్థం చెడగొట్టేందుకు కాబోయే భర్తకు మార్ఫింగ్ ఫోటోలు పంపిన మహిళ

అప్పటి నుంచి గుంగలయ్య, నక్షత దూరంగా ఉంటున్నా.. తమకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. అలాగే, ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. దీంతో.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో తెలియకుండా చింపారపల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకొని, ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లు కనిపించకపోవడంతో ఇంటి పెద్దలు గాలించగా.. వీళ్లు ఉరివేసుకొని కనిపించారు. వీరి మరణంతో ఇరుకుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా? లేకపోతే వీరిని చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.