AP Cyber crime: ఏపీలో సైబర్ నేరాల విచారణలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. అంతర్జాతీయ సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు బంగ్లాదేశ్, నైజీరియా గ్యాంగ్ లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఏలూరుకు చెందిన మహిళా న్యాయవాది రమాదేవి నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో 52 లక్షల రూపాయలు కాజేసిన ముఠా.. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్ నేరస్తులుగా గుర్తించారు. మూడు బృందాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Kakani Govardhan Reddy: నష్టపోయిన పంటల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు..?
అయితే, విదేశాల్లో ఉన్న నిందితులను అరెస్ట్ చేసుందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా రెండేళ్ల వ్యవధిలో సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.
నిందితుల వివరాలు:
1. యూపీకి చెందిన పర్వీన్ సోనా వనే
2. శర్మ
3. నితిన్ మిశ్రా అలియాస్ విక్రమ్
4. హర్సిత్ మిశ్రా అలియాస్ జయసింగ్
5. అభిషేక్ కశ్యప్
6. గోపాల్ యాదవ్
7. సురేష్ అలొనె- మహారాష్ట్ర
8. హిమత్ రావ్ పంజర్- మహారాష్ట్ర