NTV Telugu Site icon

Srisailam: రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం..

Srisailam

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.. ఫిబ్రవరి 22 నుండి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలో భాగంగా సాయంకాలం స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ నిర్వహించారు. ఇక, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో రేపటి (శనివారం) నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు శ్రీశైలం టెంపుల్‌ ఈవో లవన్న.

Read Also: Ukraine Russia War: జెలెన్‌స్కీ హత్యకు మూడు కుట్రలు..!

గర్భాలయ అభిషేకములు, అమ్మవారి కుంకుమార్చనలు, వృద్ధమల్లికార్జునస్వామివార్ల అభిషేకం, గోపూజ, గణపతి హోమం, చండీహోమం, రుద్రహోమం, శ్రీవల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం, వేదాశీర్వచనం, విరామదర్శనం మొదలైనవన్నీ యథావిధిగా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇక, రేపు హుండీల లెక్కింపు కారణంగా ఎల్లుండి నుండి స్వామివారి సామూహిక అభిషేకం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.