Site icon NTV Telugu

Maha Shivaratri: శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనుండగా.. మార్చి 4 వరకు అంటే 11 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఇక, ఈ నెల 23 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహిస్తామని, దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు.. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ ఉంటుందని.. మొదటిసారి స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్త్రాలు సమర్పిస్తుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి నుంచి భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం ఉంటుందని.. మార్చి 5వ తేదీ నుండి స్పర్శ దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని ప్రకటించారు.

Read Also: RIP Mekapati Goutham Reddy: నేడు నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయం..

Exit mobile version