Site icon NTV Telugu

సచివాలయ సిబ్బందిపై మదనపల్లె ఎమ్మెల్యే ఫైర్

చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై కోళ్లబైలులో ఎమ్మెల్యే నవాజ్ బాషా పర్యటించారు. నేతన్న నేస్తంకు 5 వేలు లంచం అడిగినట్లు ఉద్యోగిపై స్థానికులు ఆరోపణలు చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ రాజేష్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో రాజేష్‌పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశంతో రాజేష్‌ను స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి.. లబ్ధిదారులను గుర్తించడానికి వీలుగా.. లబ్ధిదారులకు నష్టం కలగకుండా ఉండేందుకు.. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందించేందుకు వీలుగా వైఎస్‌ జగన్‌ సర్కార్… గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version