Site icon NTV Telugu

Secret Marriage in Lodge: లాడ్జిలో రహస్యంగా పెళ్లి.. గర్భం దాల్చిన తర్వాత విష ప్రయోగం..!

Secret Marriage

Secret Marriage

ప్రేమ పేరుతో అబ్బాయిల చేతిలో మోసపోయిన అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు.. కొన్ని కథలు ప్రేమతో ఆగిపోతే.. మరికొన్ని పెళ్లి వరకు వెళ్తాయి.. తీరా పెళ్లి అయిన తర్వాత శారీరక వాంఛలు తీరిన తర్వాత.. వారి ఆలోచన విధానం మరోలా ఉంటుంది.. ఎవరైనా ప్రేమించుకుంటే.. ఏ గుడికో.. మరో ప్రార్థనా మందిరానికో వెళ్లి పెళ్లి చేసుకుంటారు.. రహస్య వివాహాలు చేసుకుని.. కాపురం పెట్టినవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ ప్రబుద్ధుడి వ్యవహారం మొత్తం ఆది నుంచి అనుమానాస్పదంగా ఉంది.. ఎందుకంటే.. ప్రేమపేరుతో ఓ యువతిని ట్రాప్‌ చేసిన సురేష్‌ అనే వ్యక్తి.. ఓ లాడ్జిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.. నూజివీడు మండలం రావిచర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది..

Read Also: Rains Alert: మరో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులు వర్షాలు

రహస్యంగా పెళ్లి చేసుకున్న సురేష్‌.. ఆ యువతిని శారీరకంగా అనుభవించి మోసం చేశాడు.. రావిచర్ల గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతిని ప్రేమించి రహస్యంగా లాడ్జిలో పెళ్లి చేసుకున్న అదే గ్రామానికి చెందిన సురేష్.. కొంతకాలం బాగానే ఉన్నాడు.. తన శారీరక వాంఛలు తీర్చుకున్నాడు.. తీరా, ఆ యువతి గర్భం దాల్చిన తర్వాత.. ఎలాగైనా ఆ గర్భాన్ని తొలగించాలని భావించాడు.. గర్భంలో పెరుగుతోన్న పిండాన్నే చంపేయాలనుకున్నాడు.. గర్భాన్ని తొలగించేందుకు జ్యూసులో విషయం కలిపి ఇచ్చాడు సురేష్.. ఇది గమనించిన యువతి.. తన భర్తపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version