NTV Telugu Site icon

కరోనాతో ప్రియురాలు మృతి.. ప్రియుడి ఆత్మహత్య

suicide

suicide

కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది.. కొన్ని కుటుంబాలనే పొట్టనపెట్టుకుంది.. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులు ఎందరో.. అయితే, కరోనా మహమ్మారి ఇద్దరు ప్రేమికులను కూడా బలితీసుకుంది… ప్రియురాలు కరోనాబారినపడి కన్నుమూస్తే.. ప్రియుడు ఆ విషయాన్ని జీర్ణించుకోలేపోయాడు.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో జరిగింది. గుంటూరులో కరోనాతో ప్రియురాలు మృతిచెందితే.. విశాఖలోని గాజువాక కణితి రోడ్డులోని ఓ రూమ్‌లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు యువకుడు.