NTV Telugu Site icon

Palnadu: పల్నాడు జిల్లాలో ప్రేమ వివాదం.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న యువతి!

Palnadu

Palnadu

Palnadu: పల్నాడు జిల్లాలో ప్రేమ వివాదం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియుడు మోసం చేయటమే కాక చంపేస్తానని బెదిరించడంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వినుకొండకు చెందిన యువతి సెల్ఫీ విడుదల చేసింది. ఈ ఘటన వినుకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ బి అనే యువతి, అత్తర్ నాగూర్ అనే యువకుడు గతంలో ప్రేమించుకున్నారు. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం వివాదాలకు దారి తీసింది. దాంతో గతంలో నాగూర్ పై సదరు యువతి మస్తాన్ బి కేసు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Read Also: RK Roja: వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ.. నగరిలో తాజా పరిణామాలపై చర్చ..!

అయితే, కొద్ది కాలం క్రితం జైలు నుంచి విడుదలైన అత్తర్ నాగుర్ కు, పెళ్లి కుదరింది. దీంతో మరొకసారి వీళ్ళిద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. ఆ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఆమె మాత్రం తనను నాగూర్ చంపేస్తానని బెదిరిస్తున్నాడని, సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో.. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు అత్తర్ నాగూర్ తనను నమ్మించి మోసం చేశాడని.. గతంలో జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో షేక్ మస్తాన్ బి వెల్లడించింది. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.