Site icon NTV Telugu

Love Couple: తిరుచానూరు పోలీసుల అదుపులో ప్రేమ జంట

Tiruchanr

Tiruchanr

Love Couple: తిరుచానూరు పోలీసుల అదుపులో విజయవాడకు చెందిన పొట్లూరి అలేఖ్య చౌదరి (26) మందడంకు చెందిన సాంబశివరావు (33) ప్రేమ జంట ఉంది. గత 11 ఏళ్లుగా అలేఖ్య, సాంబశివరావులు ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అలేఖ్య తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లో తెలియకుండా ఆగష్టు 15వ తేదీన పెళ్లి చేసుకున్న ప్రేమికులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి వస్తుండగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నా తల్లిదండ్రులతో ప్రాణహాని ఉందని ప్రియురాలు అలేఖ్య ఫిర్యాదు చేసింది. తమకు రక్షణ కల్పించాలని అలేఖ్య వీడియో మెసేజ్ చేసింది.

Read Also: PM Modi Praised: హాకీ కెప్టెన్ పై ప్రధాని మోడీ ప్రశంసలు..

కాగా, అలేఖ్య, సాంబశివరావుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. వీరి ప్రేమను పెళ్లిగా మారడంతో.. పెద్దలు సైతం వారికి అండగా నిలవాలని సూచించారు. వారికి ఎలాంటి దాడులు, విమర్శలు చేయడనికి వీలు లేదని తిరుచానూర్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version